- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్కడంటే
by Sujitha Rachapalli |
X
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. జమ్ము కశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జిపై 476 మీటర్ల పొడవైన ఆర్చ్‌ను ఉక్కుతో నిర్మిస్తుండగా.. మొత్తం బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. ఇక దీనికయ్యే వ్యయం రూ.1,250 కోట్లు. కాగా ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా లింక్ (USBRL) రైల్వే సెక్షన్‌లో జరుగుతున్న ఈ లైన్ నిర్మాణ పనులు పూర్తిచేయడం ద్వారా ఇండియన్ రైల్వేస్.. మరో ఇంజినీరింగ్ మైల్ స్టోన్‌ను అచీవ్ చేయబోతున్నదని రైల్వే మంత్రిత్వ శాఖ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు 2004లోనే ప్రారంభం కాగా, 2009లో నిధులు మంజూరు కాక ఆగిపోయాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకోవడంతో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Next Story