- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘రఫా’లో సైనిక చర్యలు కొనసాగిస్తాం : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంపై దాడి చేయొద్దని పలు దేశాలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అశంపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రఫాలోకి ప్రవేశించాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పేవారు..తర్వాత హమాస్‌కు సహాయం చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా రఫాలోని మిగిలిన హమాస్ ఉగ్రవాదులను అంతం చేస్తామన్నారు. రఫాలో సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తామని..అయితే పౌరులకు హాని కలగకుండా దాడులు చేస్తామని తెలిపారు. అమెరికన్ల సూచనలను అంగీకరిస్తున్నట్టు చెప్పారు. పౌరులకు హానీ కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామన్నారు. యుద్ధంలో విజయానికి చేరువలో ఉన్నామని మరోసారి పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకించే వారు హమాస్‌ను అధికారంలో ఉంచాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, రఫా నుంచి జనాభాను తరలించడానికి ప్రణాళికలు వేయాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని నెతన్యాహు ఆదేశించిన విషయం తెలిసిందే.
రఫా వివాదం ఏంటి?
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు పదిలక్షలకు పైగా పాలస్తీనియన్లు గాజా దక్షిణాన ఉన్న రఫా నగరానికి పారిపోయారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆ నగరంలో 1.3మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది యుద్ధం జరుగుతుండగా వెళ్లిన వారే ఉన్నారు. అయితే రఫాలో హమాస్ టెర్రరిస్టులు సైతం ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. అక్కడ సైనిక దాడి చేయాలని భావిస్తోంది. అయితే రఫా నగరంలో దాడులకు పాల్పడితే ప్రాణనష్టం అధికంగా ఉంటే అవకాశం ఉంది. దీంతో రఫాలో దాడులు చేయొద్దని పలు దేశాలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నారు.