- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
UNESCO: నెల్సన్ మండేలాకు ‘యునెస్కో’ అపూర్వ గౌరవం
దిశ, నేషనల్ బ్యూరో : దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాకు మరో అపూర్వ గుర్తింపు దక్కింది. ఆయన చదువుకున్న ఈస్టెర్న్ కేప్ ప్రావిన్స్‌లోని ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయాన్ని యునెస్కో వారసత్వ పరిరక్షణ జాబితాలో చేర్చారు. మండేలా తొలిసారిగా రాజకీయంగా యాక్టివ్ అయిన క్వెకెజ్వెనీ గ్రామాన్ని కూడా ఈ లిస్టులో చేర్చారు. తన ఆత్మకథ "లాంగ్ వాక్ టు ఫ్రీడమ్"లో క్వెకెజ్వెనీ గ్రామంతో తనకున్న అనుబంధం గురించి మండేలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈవిధంగా దక్షిణాఫ్రికాలోని మొత్తం 14 ప్రదేశాలను కలుపుకొని ‘‘మానవ హక్కులు, విముక్తి, సయోధ్య : నెల్సన్ మండేలా చారిత్రక ప్రదేశాలు’’ పేరుతో ఒక జాబితాను యునెస్కో రూపొందించింది.
1960 నాటికి దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల ఆధిపత్యం కలిగిన మైనార్టీ ప్రభుత్వం ఉండేది. వారు దేశంలోని మెజారిటీ నీగ్రో జాతి ప్రజలను చిన్నచూపు చూసేవారు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెల్సన్ మండేలా పోరాటం చేశారు.ఈక్రమంలో 1960లో షార్ప్ విల్లే గ్రామంలో నిరసన తెలుపుతున్న 69 మంది నల్లజాతి నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారు. నెల్సన్ మండేలా పోరాటానికి ఈ ఘటన టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పోరాటాన్ని నిలువరించలేక.. దక్షిణాఫ్రికా నుంచి వైదొలగాలని బ్రిటీషర్లు నిర్ణయించారు. 1961 మే 31న రిపబ్లిక్ దేశంగా దక్షిణాఫ్రికా అవతరించింది. అందుకే షార్ప్ విల్లే గ్రామాన్ని కూడా తాజాగా యునెస్కో వారసత్వ పరిరక్షణ జాబితాలో చేర్చారు.