రష్యన్ లాంగ్-రేంజ్ బాంబర్‌ను కూల్చివేసిన ఉక్రెయిన్(వీడియో)

by Disha Web Desk 17 |
రష్యన్ లాంగ్-రేంజ్ బాంబర్‌ను కూల్చివేసిన ఉక్రెయిన్(వీడియో)
X

దిశ, నేషనల్ బ్యూరో: గత రెండు సంవత్సరాలుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు దేశాలు భారీ సంఖ్యలో సైనికులు, పౌరులను కోల్పోయాయి. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన లాంగ్-రేంజ్ బాంబర్‌ను ఉక్రెయిన్ దళాలు కూల్చివేసినట్లు ప్రకటించారు. రష్యా తమ దేశంపై దాడి చేసిన తర్వాత మొదటిసారిగా రక్షణ నిఘా సహకారంతో వైమానిక దళానికి చెందిన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి యూనిట్లు Tu-22M3 లాంగ్-రేంజ్ వ్యూహాత్మక బాంబర్‌ను నాశనం చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపిందని, AFP వార్తా సంస్థ తెలిపింది.

ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్‌లో, మా నగరాలపైకి దాడి చేయడానికి రష్యా ఉపయోగించే బాంబర్‌ను మా వైమానిక దళం కూల్చివేసిందని ప్రకటించారు. అయితే ప్రమాదానికి గురైన విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా బ్రతికే ఉన్నారని, ఆసుపత్రికి తరలించామని మొదట రష్యా వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనలో ఒకరు మరణించారని సమాచారం. Tu-22M3 విమానం యుద్ధ ఆపరేషన్‌ను నిర్వహించి బేస్ ఏరోడ్రోమ్‌కి తిరిగి వస్తుండగా స్టావ్‌రోపోల్ ప్రాంతంలో కూలిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ప్రభుత్వ-రక్షణ TASS వార్తా సంస్థ పేర్కొంది. స్టావ్రోపోల్ గవర్నర్ వ్లాదిమిర్ వ్లాదిమిరోవ్ కూడా దీనిని ధృవీకరించారు. వీరిలో ఒకరు మరణించారని, మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించామని, మరో వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. విమాన కూలిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Next Story

Most Viewed