రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

by M.Rajitha |
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
X

దిశ, వెబ్ డెస్క్ : 2024 కు గాను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల(Nobel Prizes 2024) గ్రహీతల వివరాలను స్వీడన్ లోని నోబెల్ బృందం విడుదల చేస్తోంది. తాజాగా బుధవారం రసాయనశాస్త్రం(Chemistry)లో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ప్రోటీన్లకు సంబంధించిన పరిశోధనలకు గాను డేవిడ్ బెకర్, డెమీస్ హాసబిస్, జాన్ ఎ.జంపర్ లను ఈ ఏడాది రసాయనశాస్త్ర నోబెల్ గ్రహీతలుగా వెల్లడించారు.

స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా.. వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. ఈ బహుమతులను నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న గ్రహీతలకు అందజేస్తారు. కాగా సోమ, మంగళ వారాల్లో వైద్య, భౌతిక శాస్త్ర రంగాలకు పురస్కార గ్రహీతలను ప్రకటించగా.. నేడు రసాయనశాస్త్రానికి ప్రకటించారు. గురువారం సాహిత్య విభాగానికి, శుక్రవారం శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు.

Advertisement

Next Story