బ్లాక్‌హోల్ ఎంత డేంజ‌రో తెలుసు.. దాని సౌండ్ తెలుసా.?! నాసా న‌యా వీడియో

by Sumithra |
బ్లాక్‌హోల్ ఎంత డేంజ‌రో తెలుసు.. దాని సౌండ్ తెలుసా.?! నాసా న‌యా వీడియో
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సృష్టిలో బ్లాక్ హోల్ అంత డేంజ‌ర‌స్ మ‌రోటి ఉండ‌దేమో..?! ఏదైనా ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలిస్తే ఒక అంచ‌నా అయిన ఉంటుంది. కానీ, దైన్నైనా త‌న‌లోకి లాగేసుకునేంత ప‌వ‌ర్‌ఫుల్ బ్లాక్‌హోల్లో లోప‌ల ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికీ ఎలాంటి క్లూ లేదు. నిజానికి, ఈ అనంత విశ్వంలో బ్లాక్స్‌హోల్స్ ఎన్నున్నాయో కూడా క‌చ్ఛితంగా చెప్ప‌లేరు. అంతేకాదు, అంతరిక్షంలో శబ్దం లేదనే న‌మ్మ‌కం కూడా లేక‌పోలేదు. ఈ శూన్యంలో ధ్వని తరంగాలు ప్రయాణించలేవ‌ని, ఆ వ్యాక్యూమ్ దాన్ని అనుమతించదని అనుకునేవారు. కానీ, మొత్తం గెలాక్సీ క్లస్టర్ చుట్టూ పెద్ద మొత్తంలో వాయువు ఉంద‌ని, ఇది ధ్వని తరంగాలను అడ్డంకులు లేకుండా ప్రవహించేలా చేస్తుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో, పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ చేసే శ‌బ్ధాన్ని నాసా తాజాగా రికార్డ్ చేసింది. ఇది మ‌నిషి వినికిడి శ‌క్తికి మించిన శ‌బ్ధ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. పెర్సియస్ గెలాక్సీ భూమికి 240 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 2003 నుండి ధ్వనితో ముడిపడి ఉన్న ఈ బ్లాక్‌హోల్ శ‌బ్ధాన్ని వివరించడానికి శాస్త్రవేత్తలు, బ్లాక్ హోల్‌ నుండి పీడన తరంగాలను వేడిచేసిన గ్యాస్ క్లౌడ్‌లో పైకి, క్రిందికి వేవ్స్‌లాగా చేసి, మధ్యలో 57 ఆక్టేవ్ మిడిల్ సి అబ్జ‌ర్వేట‌రీని సృష్టించారు.

ఇప్పుడు, ఈ కొత్త సోనిఫికేషన్ ద్వారా బ్లాక్ హోల్ సౌండ్ మెషిన్ చాలా ర‌కాల శ‌బ్ధాల‌ను గుర్తిస్తుంది. ఈ సంవత్సరం, NASA బ్లాక్ హోల్ వీక్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా, ఈ కొత్త సోనిఫికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇది నాసా చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ నుండి తీసుకున్న‌ డేటాలో స్వీక‌రించారు. ఖగోళ శాస్త్రవేత్తలు గతంలో గుర్తించిన ధ్వని తరంగాలను ఉపయోగించి పెర్సియస్ కొత్త సోనిఫికేషన్ సృష్టించారు. ఇక‌, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సౌండ్ వినబడక పోవ‌డం విశేషం. చంద్ర అబ్జర్వేటరీ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ల‌క్ష‌ల‌ మంది చూస్తున్నారు. ఇది హ‌ర్ర‌ర్‌ సినిమా సంగీతంలా ఉందని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed