- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా ఎగరవేసి నిరసన.. 900 మంది అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొలంబియా, లాస్ ఎంజిల్స్ సహా దేశవ్యాప్తంగా 21 యూనివర్సిటీల్లో భారీగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాజాలో దాడులను అపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలపై పోలీసులు, వర్సిటీల అధికారులు ఉక్కుపాదం మోపుతున్న నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిరసనకారులు పాలస్తీనా జెండాను ఎగురవేయడం కలకలం రేపింది.
వర్సిటీలోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రదేశంలో అమెరికా జెండా ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఎవరైనా విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు వారి దేశ జెండాలను అక్కడ ఉంచడం ఆనవాయితీ. కానీ నిరసనకారులు అమెరికా జెండాను తీసివేశారని, ఆ ప్రదేశంలో పాలస్తీనా జెండా ఎగురవేయడం చర్చానీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు దారులు తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ మద్దతు దారులు అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారు. కాగా, గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్‌ల సంఖ్య 900లకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.