- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Khasawneh: జోర్డాన్ ప్రధాని రాజీనామా.. తదుపరి పీఎం ఆయనే?
దిశ, నేషనల్ బ్యూరో: జోర్డాన్ ప్రధాన మంత్రి బిషర్ అల్-ఖసావ్నే ఆదివారం తన పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు కింగ్ అబ్దుల్లా IIకి రాజీనామా లేఖను అందజేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రముఖ ఇస్లామిక్ పార్టీ ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ విజయం సాధించింది.138 సీట్లలో 31 స్థానాలను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 70 సీట్లు అవసరం. మిగతా పార్టీలు సైతం ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 1989 ఎన్నికల తర్వాత తొలిసారిగా ఇస్లామిక్ పార్టీలకు అధిక సీట్లు వచ్చాయి. దీంతో జోర్డాన్‌లో ఇస్లామిక్ ప్రతిపక్షం పైచేయి సాధించడంతో ఖాసావ్నే రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. జోర్డాన్ తదుపరి ప్రధానిగా జాఫర్ హసన్ జోర్డాన్ నియామకం అయ్యే చాన్స్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన కింగ్ అబ్దుల్లా కార్యాలయంలో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఖసావ్నే 2020 అక్టోబర్ 12న దేశ 24వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.