- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాల్దీవులను వీడుతున్న భారత సైన్యం!
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తమ దేశం నుంచి భారత బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో నిఘా విమానాలను నడుపుతున్న భారత సైనిక సిబ్బంది మాల్దీవులు నుంచి నిష్క్రమించడం ప్రారంభించారు. దక్షిణ అటాల్‌లో మోహరించిన 25 మంది భారతీయ సైనికులు మాల్దీవులను విడిచిపెట్టినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే దీనిని భారత్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం మే 10 నాటికి మాల్దీవుల సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే మొదటగా 25మంది సైనిక సిబ్బంది మాల్దీవులను వీడినట్టు తెలుస్తోంది.
కాగా, సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో ముయిజ్జు గెలిచినప్పటి నుంచి మాల్దీవులు, భారత్ మధ్య సంబంధాలు క్షీణించాయి. అధ్యక్షుడైన ఎన్నికైనప్పటి నుంచి ముయిజ్జు భారత్ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారు. చైనాలో పర్యటించి పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాడు. చైనా నిఘా నౌకను సైతం మాల్దీవులు జలాల్లోకి అనుమతించారు. గత వారం కూడా ముయిజ్జూ, మే 10 తర్వాత తమ దేశంలో పౌరుల దుస్తులతోనూ భారతీయ సైనిక సిబ్బందిని అనుమతించబోమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం మాల్దీవులలో 89 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు.