Elon Musk: ట్రంప్ ను గూగుల్ బ్యాన్ చేసిందా..! ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్

by Ramesh Goud |
Elon Musk: ట్రంప్ ను గూగుల్ బ్యాన్ చేసిందా..! ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను గూగుల్ సెర్చ్ బ్యాన్ చేసిందా..! అని ప్రముఖ టెక్ దిగ్గజం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అని అన్నారు. ట్రంప్ సమాచారాన్ని గూగుల్ చూపించట్లేదని అందుకు సంబందించిన స్క్రీన్ షాట్లను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెటా ఏఐలో ట్రంప్ పై జరిగిన దాడి గురించి అడిగినప్పుడు.. దానికి సంబందించి సమాచారం తన వద్ద లేదని సమాధానం ఇచ్చింది. అదే సమయంలో అధ్యక్ష రేసులో ఉన్న కమలా హ్యారీస్ ప్రచారం గురించి అడిగితే.. పూర్తి సమాచారాన్ని అందించింది అని ఓ స్క్రీన్ షాట్ షేర్ చేశారు. అంతేగాక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ప్రెసిడెంట్ డోనాల్డ్ అని టైప్ చేస్తే.. గూగుల్ ఏఐ వేరే సమాచారాన్ని తీసుకొస్తుందని, డోనాల్డ్ ట్రంప్ అని సెర్చ్ చేయడాన్ని గూగుల్ నిషేదం విధించిందా..! అని ప్రశ్నించారు. అలాగే గూగుల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ జోక్యం చేసుకుంటోందని, ఇది ఇలాగే కొనసాగితే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed