Donald Trump:తన కొత్త పుస్తక్కాన్ని రిలీజ్ చేసిన ట్రంప్..కొన్ని గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లార్ గా రికార్డు

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-04 23:15:56.0  )
Donald Trump:తన కొత్త పుస్తక్కాన్ని రిలీజ్ చేసిన ట్రంప్..కొన్ని గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లార్ గా రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్:అగ్రరాజ్యం అమెరికా(America)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 24 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.కాగా డెమోక్రటిక్(Democratic) పార్టీ నుంచి కమలా హారిస్(Kamala Haris), రిపబ్లికన్(Republic) పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్ష రేసులో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో తమ స్పీడ్ పెంచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలావుంటే ట్రంప్ తో పాటు తన పుస్తకం సేవ్ అమెరికా(Save America) కూడా అమెజాన్(Amazon) లో దూసుకుపోతుంది.వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ట్రంప్ సేవ్ అమెరికా పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. సెప్టెంబర్ 3న విడుదలైన ఈ పుస్తకం కొద్దిగంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీని ధర 92.06డాలర్లుగా ఉన్నప్పటికీ, మాజీ అధ్యక్షుడి పుస్తకం అమెజాన్ యొక్క 'ప్రెసిడెంట్స్ & హెడ్స్ ఆఫ్ స్టేట్ బయోగ్రఫీస్' విభాగంలో నంబర్ 1 స్థానంలో ఉంది. మొత్తం మీద 13వ స్థానంలో నిలిచింది.

ఈ పుస్తకంలో ఏముంది..?

ఈ పుస్తకంలో ట్రంప్ అధ్యక్షుడిగా పదవిలో ఉన్న సమయం, అతని అధ్యక్ష ఎన్నికల ప్రచారాల చిత్రాలు, జ్ఞాపకాలు పొందుపరిచారు.అయితే పెన్సిల్వేనియా(Pennsylvania) ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపిన తరువాత ట్రంప్ తన పిడికిలి బిగించిన సమయంలో తీసిన ఫోటోనే ఈ పుస్తకానికి కవర్ పేజీగా వాడారు.టైగర్ వుడ్స్, ఏంజెలా మెర్కెల్, కిమ్ జోంగ్ ఉన్ వంటి వ్యక్తులతో ఉన్న ఫోటోలను ట్రంప్ ఈ పుస్తకంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.అలాగే మార్క్ జుకర్‌బర్గ్‌ను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలు,2018లో పోలాండ్ రాజధాని హెల్సింకిలో రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తో సమావేశాన్నిఇందులో పొందుపరిచారు.

సేవ్ అమెరికా పుస్తకానికి ట్రంప్ ప్రచారం..

ట్రూత్ సోషల్ పోస్ట్ లో ట్రంప్ ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నారు.“నా కొత్త పుస్తకం ఈరోజు వస్తుంది! మీరు ఈ కాపీని పొందారా? నేను వైట్ హౌస్‌లో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారం వరకు ప్రతి ఫోటోను ఇందులో పొందుపరిచానని పోస్ట్ లో తెలిపారు. ఈ ఫోటోలను తానే ఎంపిక చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed