- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇజ్రాయెల్‌లో మరోసారి ఆందోళనలు: ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అర్ధసంవత్సారానికి చేరుకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు భారీగా నిరసనలు తెలిపారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రధాని నెతన్యాహు వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అంతేగాక ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టెల్ అవీవ్‌లో వేలాదిగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇతర నగరాల్లోనూ నిరసనలు జరిగినట్టు వెల్లడించాయి. గాజాలో బంధీలుగా ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా వీరికి మద్దతు తెలిపారు. టెల్ అవీవ్‌లో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది.
కాగా, గతేడాది అక్టోబర్ 7వ తేదీన గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడి చేయగా 1200 మంది ఇజ్రాయెలీలు మరణించారు. అనంతరం 250 మందిని బంధీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 33,137 మంది మరణించారు. బంధీల విడుదలకై శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ అవి ఫలితాలనివ్వడం లేదు. మరోవైపు గాజాలో పరిస్థితులు అత్యంత దుర్భరంగా మారాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు.