- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరిహద్దు సమస్యను వాటి నుంచి వేరు చేయాలి : జైశంకర్ వ్యాఖ్యలపై చైనా స్పందన
దిశ, నేషనల్ బ్యూరో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాలను మోహరించడం వల్ల భారత్-చైనా రెండు దేశాలకు మేలు జరగలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై చైనా స్పందించింది. సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక సంబంధాల నుంచి వేరు చేయాలని సూచించారు. ‘బార్డర్‌లో శాంతి నెలకొనకపోతే చైనాతో సంబంధాలు తెలిపోతాయని భారత్ చెబుతోంది. కానీ ఈ ప్రాబ్లమ్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపదు’ అని చెప్పారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెంపొందించుకోవాలని తెలిపారు. చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితిని త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాల ఉమ్మడి ప్రయోజనాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
‘దౌత్య, సైనిక మార్గాల ద్వారా కమ్యూనికేషన్‌ను కొనసాగించడం ఎంతో ముఖ్యం. ఇరు దేశాలు ముందస్తు తేదీలో అంగీకరించగల సంబంధిత సరిహద్దు సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలి. అంతేగాక నాయకుల మధ్య ఉమ్మడి అవగాహన, సంబంధిత ఒప్పందాల స్ఫూర్తిని ఇరుపక్షాలు అనుసరించాలి’అని వాంగ్ వెన్ బిన్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూనే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భారత్ చైనాతో ఓకే దిశలో పని చేస్తుందని, ఈ సంబంధాలు మరింత బలపడాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. విభేదాలను పక్కన బెట్టి న్యాయబద్దంగా సమస్యలను ఓ కొలిక్కి తీసుకురావాలని తెలిపారు. కాగా, 2020 జూన్‌లో గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.