ఆ మహిళే కాదు.. ఆమె ఊరి వాళ్లను కూడా జీవితాంతం మర్చిపోకుండా చేసిన పీతల కూర

by Nagaya |
ఆ మహిళే కాదు.. ఆమె ఊరి వాళ్లను కూడా జీవితాంతం మర్చిపోకుండా చేసిన పీతల కూర
X

దిశ, వెబ్‌డెస్క్ : మన జీవితంలో ఎన్నో మర్చిపోలేని అనుభూతులు, మరపురాని సంఘటనలు ఉంటాయి. మంచైనా, చెడైనా, ప్రతిభ కనబరిచినా.. విదేశీయానం చేసినా ఇలా సంఘటన ఏదైనా కొన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. అలాగే జరిగింది ఓ మహిళకు. ఆమె చేసిన రచ్చకు ఆమె జీవితంలోనే కాదు.. ఆ మహిళ సొంత గ్రామంలో కూడా ఆ ఘటనను మర్చిపోలేకుండా చేసింది. ఇంతకూ ఆమె చేసిన పని ఏంటనేగా మీ డౌట్.. అదే ఆమె కడుపు నిండా పీతల కూర తిని ఆ బిల్లు చెల్లించకుండా పోలీస్ స్టేషన్‌కు ఎక్కడమే.. ఇంతకూ విషయం ఏంటంటే..?

జపాన్‌కు చెందిన జుకో షిన్టా అనే ఓ మహిళ వారం రోజుల క్రితం సింగపూర్ ట్రిప్ వేసింది. స్నేహితులతో కలిసి అక్కడి పర్యాటక ప్రాంతాల్లన్నీ తిరిగిన ఆమె ఆకలి తీర్చుకునేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన వెయిటర్ తమ రెస్టారెంట్‌లో అలస్కాన్ కింగ్ క్రాబ్ చిల్లీ డిష్ (పీతల వంటకం) అద్భుతంగా ఉంటుందని నోరు ఊరేలా చెప్పాడు. రేటు కూడా కేవలం 30 డాలర్లే (రూ.2500) అనడంతో.. ఆర్డర్ ఇచ్చి బిర్రుగా ఆరగించారు. ఇక వెయిటర్ తెచ్చిన బిల్లును చూసి సదరు మహిళ శివాలెత్తింది. చిల్లీ క్రాబ్‌కు కేవలం 30 డాలర్లు అని బిల్లులో 938 డాలర్లు (రూ.57 వేలు) వేశారని గొడవకు దిగింది. అంత బిల్లు నేను చెల్లించలేనని తేల్చిచెప్పింది. ఇక చేసేదేం లేక రెస్టారెంట్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే 100 గ్రాముల చిల్లీ క్రాబ్‌కు 30 డాలర్లు అని చెప్పామని వెయిటర్ చెబుతుండగా.. అలా చెప్పలేదని మూడున్నర కిలోలు ఉన్న డిష్‌కే అంత రేటు చెప్పాడని జపాన్ మహిళ వాదించింది. మధ్యే మార్గంగా పోలీసుల సూచన మేరకు రెస్టారెంట్ ఓనర్ 107 డాలర్లు ( రూ.8,873) తగ్గించి మిగతా బిల్లు తీసుకున్నాడు. ఈ విషయాన్ని జుకో షిన్టా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ మహిళ నివాసం ఉండే గ్రామస్తులు సైతం దానిని చూసి నవ్వుకోవడంతోపాటు జుకో షిన్టా బలే మెమోరబుల్ సన్నివేశాన్ని క్రియేట్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed