- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్థానిక ఉత్పత్తి కోసం సియామ్‌తో కలిసి పనిచేస్తున్నాం : ఏసీఎంఏ
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకునేందుకు దేశీయంగానే విడిభాగాల తయారీని పెంచేందుకు ఆటో కాంపొనెంట్ పరిశ్రమ, సియామ్ కలిసి పనిచేస్తున్నాయని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్ జైన్ గురువారం తెలిపారు. రెండు రోజుల ‘ఏసీఎంఏ ఆటోమెకానికా’ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో మాట్లాడిన ఆయన.. నాణ్యత తక్కువున్న విడిభాగాల దిగుమతులను తగ్గించేందుకు ఈ ప్రయత్నం దేశీయ పరిశ్రమకు సహాయపడుతుందని చెప్పారు. “ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీదారుల సంఘం(ఏసీఎంఏ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు(సియామ్) ఆటో విడిభాగాల రంగంలో స్థానిక ఉత్పత్తిని పెంచేందుకు కలిసి పచేస్తున్నాయన్నారు. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో ధరల పోటీతత్వాన్ని పెంచుతుందని” దీపక్ జైన్ తెలిపారు. అంతేకాకుండా భారత్ నుంచి ఎగుమతులను పెంచేందుకు వీలవుతుందని, స్థానిక ఉత్పత్తి ద్వారా ధర తక్కువగా ఉండటంతో దిగుమతి అవుతున్న నకిలీ, తక్కువ నాణ్యత పరికరాల దిగుమతులను అరికట్టేందుకు సహాయపడుతుందన్నారు. ఇటీవల విడిభాగాల పరిశ్రమకు పీఎల్ఐ పథకాన్ని విస్తరించడం ద్వారా ఎగుమతులను పెంచే అవకాశం ఉంటుందని దీపక్ జైన్ పేర్కొన్నారు.