తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

by Shyam |
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
X

దిశ, వరంగల్:
తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం వెల్ది గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నూనెముంతల లక్ష్మయ్య గౌడ్ (55) సాయంత్రం కల్లు తెచ్చేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి కింద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

Tags: janagama, man death, worker, taddy water

Advertisement

Next Story