టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో టూరిస్ట్ గైడ్స్‌గా మహిళలకు చాన్స్!

by Sujitha Rachapalli |
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో టూరిస్ట్ గైడ్స్‌గా మహిళలకు చాన్స్!
X

దిశ, ఫీచర్స్ : ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన ‘రిప్డ్ జీన్స్’ వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా, ఆయన క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహిళల కోసం ఆయన చేసిన ప్రకటన పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే.. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా, రాంనగర్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ వన్యప్రాణి అభయారణ్యంలో మహిళా డ్రైవర్లు, గైడ్లను నియమిస్తున్నట్లు, వారికి అవసరమైన ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.

టైగర్ రిజర్వ్‌లో లైట్ అండ్ సౌండ్ షో, ఆంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మహిళా డ్రైవర్లకు ‘చంద్రసింగ్ గర్‌‌వాలీ’ పథకంలో భాగంగా జిప్సీ వెహికల్స్ కొనేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం వివరించారు. ఇందు కోసం కొనుగోలు చేయనున్న 50 వెహికల్స్‌‌తో భారత్‌లో తొలిసారిగా మహిళా డ్రైవర్స్, గైడ్స్.. టూరిస్టులను టైగర్ రిజర్వ్‌కు సఫారికి తీసుకెళ్లనున్నారు. మొత్తంగా 50 మంది మహిళా నేచర్ గైడ్స్, 50 మంది మహిళా జిప్సీ డ్రైవర్లు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత టైగర్ రిజర్వ్‌లో జాయిన్ కానున్నారు. ప్రస్తుతం టైగర్ రిజర్వ్‌లో 73 మంది నేచర్ గైడ్స్ ఉండగా, అందులో 8 మంది మహిళలున్నారు.

Advertisement

Next Story

Most Viewed