- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, వెబ్‌డెస్క్ : స్కూల్‌లో అందరు విద్యార్థుల బ్యాగుల్లో పక్కాగా ఉండే వస్తువు ఏదైనా ఉందంటే.. అది ‘జామెట్రీ బాక్స్’. బాల్యంలో అమ్మనాన్నలు కొత్త బాక్స్ కొనిచ్చినప్పుడు కలిగే ఫీలింగ్‌ను అందరూ ఆస్వాదించే ఉంటారు. అది పక్కనబెడితే, జామెట్రీ బాక్స్‌లో ఉండే టూల్స్(ఉపకరణాలు)తో బొమ్మలు గీసే వాళ్లం తప్ప, నిజంగా అవి ఎందుకోసం ఉపయోగపడతాయో చాలా మందికి తెలియదు. అయితే, లేటెస్ట్‌గా ఓ మహిళ.. కంపాక్స్ బాక్స్‌లోని టూల్స్ ఎందుకు ఉపయోగపడతాయో.. చాలా ఫన్నీగా చెప్పిన వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్విట్టర్ యూజర్ అపర్ణ రామచంద్ర.. ‘కామిక్ వే’లో చెప్పిన జామెట్రీ బాక్స్‌లోని టూల్స్ ఉపయోగాలేంటో మీరూ ఓసారి లుక్కేయండి.
ఎరేజర్ : రెండో రోజు వరకు దాని మీదున్న కవర్ బోర్ కొడుతుంది. మూడో రోజు.. కవర్ పోతుంది. ఇక నాలుగో రోజు వచ్చేసరికి ‘ఎరేజర్’ కనిపించకుండా పోతుంది.
కంపాక్స్ : దీన్ని ఉపయోగించి ఒక పేజీలో సర్కిల్ డ్రా చేస్తే.. తర్వాతి పది పేజిలకు హోల్ పడుతుంది.
షార్పనర్ : ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. పరీక్షలకు ఒక రోజు ముందు మాత్రం కనపడకుండా పోతుంది.
ప్రొట్రాక్టర్ : కళ్లమీద పెట్టుకునే చూడగానే.. ఇంద్రధనస్సులాగా కనిపిస్తుంది. అంతేకాదు ‘డి’ లాగా కనిపిస్తుంది.
సెట్ స్క్వేర్స్ : స్కేల్ పోయినప్పుడో లేదా విరిగిపోయిన సందర్భంలోనో.. వీటిని స్కేల్‌లా ఉపయోగిస్తాం. అంతకుమించి ఏ ఉపయోగం లేదు.
పెన్సిల్ : ఎన్నిసార్లు షార్ప్ చేసినా.. విరిగిపోతూనే ఉంటుంది.
ఇలా వినోదాత్మకంగా జామెట్రీ బాక్స్ ఉపయోగాలను ప్రజెంట్ చేసి, ఆ సంగతే మరిచిపోయిన వాళ్లందరికీ, అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసే ప్రయత్నం చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడం విశేషం.