- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఢిల్లీ సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీఐపీలు, అధికారులు

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta)కు అవకాశం ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 20న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా సీఎం అధికారిక నివాసంగా ఉపయోగించాల్సిన "షీష్ మహల్" (మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివసించిన ఇల్లు)లో నివసించడానికి ఆమె నిరాకరించారు. మాజీ సీఎం కేజ్రీవాల్ షీష్ మహల్ (Sheesh Mahal) ను ప్రజల సొమ్ముతో నిర్మించారని.. అది ప్రజలకే చెందాలని అన్నారు. ఈ మేరకు ఆమెకు మరో అధికారిక నివాసాన్ని కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు సీఎం రేఖా గుప్తా.. శాలిమార్ బాగ్ (Shalimar Bagh)లోని తన నివాసం నుంచే ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటు కేబినెట్ మంత్రులకు కూడా అధికారిక నివాసాల కేటాయింపు ప్రక్రియ జరుగుతోంది. కానీ ఇప్పటివరకు అది పూర్తి కాలేదు.
రేఖా గుప్తా తన ఇంటి నుంచి పరిపాలన వ్యవహారాలను చూస్తూ, ప్రజలతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఢిల్లీలోని వివిధ కార్యాలయాల నుంచి సీఎం నివాసం 25 కిలోమీటర్లు ఉండటంతో అధికారులు, వీఐపీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు సమయ పాలన దెబ్బతింటుందని అధికారులు వాపోతున్నారు. కానీ సీఎం రేఖా గుప్తా మాత్రం తనకు ప్రభుత్వం మరో బంగ్లాను ఇచ్చే వరకు ఇంటి నుంచే పాలన కొనసాగిస్తానని.. తనకు ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇక్కడే అనుకూలంగా ఉన్నట్లు తెలుపుతున్నారు. కాగా సీఎం అధికారిక నివాసం కేటాయింపు మరో రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ అధికారులు తెలుపుతున్నారు.