హురున్ గ్లోబల్-500 జాబితాలో 12కు చేరిన భారత కంపెనీల సంఖ్య

by Harish |
హురున్ గ్లోబల్-500 జాబితాలో 12కు చేరిన భారత కంపెనీల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: హురున్ గ్లోబల్-500 జాబితాలో భారత్‌కు చెందిన కంపెనీల సంఖ్య 12కి చేరుకున్నాయి. తాజా జాబితా ప్రకారం.. ఇప్పటికే ఉన్న సంస్థలతో పాటు కొత్తగా విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ ప్రపంచంలోనే టాప్ 500 కంపెనీలుగా చోటు దక్కించుకున్నాయి. ఇప్పటివరకూ ఈ జాబితాలో 12 కంపెనీలు స్థానం సంపాదించుకోవడంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. రూ. 13.97 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అత్యంత విలువైన కంపెనీగా ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 12.19 లక్షల కోట్లతో రెండో భారత కంపెనీగా ఉంది.

రూ. 8.04 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాతి స్థానంలో ఉంది. ఇక, కొత్తగా ఈ జాబితాలో చేరిన విప్రో 457వ ర్యాంకును సాధించగా, ఏషియన్ పెయింట్స్ 477, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 498వ ర్యాంకును సాధించాయి. ప్రపంచంలోనే అత్యంత విలువ కంపెనీగా ఆపిల్ సంస్థ 2.4 ట్రిలియన్ డాలర్లతో కొనసాగుతోంది. తర్వాత మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ కంపెనీలున్నాయి. హురున్ గ్లోబల్ టాప్-500 కంపెనీల జాబితాలో అమెరికా మొత్తం 243 కంపెనీలతో ఆధిక్యంలో ఉండగా, చైనా 47 కంపెనీలతో రెండో స్థానంలో ఉంది. 30 కంపెనీలతో జపాన్ మూడో స్థానంలో, 24 కంపెనీలతో యూకే తర్వాతి స్థానంలో ఉంది.

Advertisement

Next Story