- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కర్ఫ్యూ టైమ్‌లో వైన్స్ ఓపెన్..!
by Anukaran |

X
దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో రాత్రి 8 గంటల వరకు అత్యవసర సేవలు మినహా.. అన్ని రకాల షాపులు, రెస్టారెంట్, బార్లు, వైన్ షాప్‌లు మూసివేయాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ.. నారాయణపురం మండల కేంద్రంలో ఓ వైన్ షాప్ రాత్రి 8 గంటల తర్వాత కూడా తెరిచిపెట్టారు. ఇక తొలి రోజే ఇలా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడమేంటని స్థానికులు మండిపడుతున్నారు. మరి ప్రభుత్వ ఆదేశాలను పాటించని ఈ వైన్ షాప్ యజమానులపై అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Next Story