- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బై పోల్ ఎఫెక్ట్.. మద్యం దుకాణాల్లో నిండుతున్న గల్లా పెట్టెలు
దిశ, హుజురాబాద్ : ఐదు నెలలకు పైగా ప్రచార పర్వంలో మునిగితేలుతున్న హుజురాబాద్‌లో గెలుపోటములు ఎవరిని వరిస్తాయో తెలియదు కానీ, అక్కడి వారికి అనుకూలంగా మారిందని చెప్పాలి. తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోందని సంబరపడుతున్నారు. బై పోల్ జరుగుతున్న నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మునిసిపాలిటీలలో ఆయా పార్టీలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. ఈ క్యాంపెన్‌లో పాల్గొనేందుకు రాష్ట్రం నలమూలల నుండి వివిధ పార్టీల నాయకులు పాల్గొంటున్నారు. సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుని వరకు ప్రతిఒక్కరూ నియోజకవర్గంలోని పల్లెపల్లెను తడుతున్నారు.
చాలామంది నాయకులు హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ఉంటున్నారు. మరికొంతమంది నాయకులు సమీపంలోని పట్టణాల్లో ఉంటున్నారు. నిత్యం అన్నీ పార్టీలకు చెందిన వారు 10 వేలమందికి పైగా స్థానికేతరులు ఇక్కడ జరుగుతున్న ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలోని హోటల్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, వైన్ షాపులు, బార్లలో రద్దీ తీవ్రంగా పెరిగింది. గతంలో జరిగిన వ్యాపారానికి ఇప్పుడు జరుగుతున్న అమ్మకాలకు పొంతన లేకుండా పోయింది. గతంలో రోజుకు రూ.10 వేల నుండి 12 వేల వరకు సాగిన వ్యాపారం ఇప్పుడు రూ. 35 నుండి 40 వేల వరకు సాగుతోంది.
40 శాతం పెరిగిన లిక్కర్ సేల్స్..
హుజురాబాద్ అంతటా అతి ఎక్కువగా మద్యం వ్యాపారం సాగుతోంది. ఎన్నికలకు ముందు, ఇప్పుడు పోలిస్తే 40 శాతం లిక్కర్ సేల్స్ పెరిగింది. ఇక్కడి వైన్ షాపులు, బార్లు కళకళలాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో చీప్ లిక్కర్ అమ్మకాలు అంతగా లేవు. రెగ్యులర్ రేంజ్, ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్ తీవ్రంగా పెరిగింది. రెగ్యులర్ రేంజ్ పరిధిలో ఉన్న లిక్కర్ బ్రాండ్లు 30 శాతం వరకు పెరగగా, ప్రీమియం బ్రాండ్లు 10 శాతం వరకూ పెరిగాయి.