- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త కాపురంలో ‘నాన్‌వెజ్’ చిచ్చు.. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య ఏం చేసిందంటే.?
దిశ, వెబ్ డెస్క్ : నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. ఆదివారం వస్తే చాలు మటన్, చికెన్ షాపుల ముందు బారులు తీరుతారు నాన్ వెజ్ ప్రియులు. ఇక వీరి సంఖ్య వేలలోనే ఉంటుంది. ఇంక కొంత మందికైతే ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇదే క్రమంలో నాన్ వెజ్ ఇష్టపడని వారు కూడా ఉంటారు. ఇక నాన్ వెజ్ ఇష్టపడని ఉంటారు. వారు నాన్ వెజ్ చూడటానికే మఖం చాటేస్తారు. అయితే ఇప్పడు వెజ్, నాన్ వెజ్ గొడవ ఏంటీ అనుకుంటున్నారా.. ఈ వెజ్, నాన్ వెజ్‌సమస్యనే కొత్త జంట కాపురంలో చిచ్చు పెట్టింది. భర్తమో వెజ్.. భార్యమో నాన్ వెజ్.. ఈమెకు ముక్కలేనిదే ముద్దదిగదు. అతనికేమో ముక్కంటేనే పడదు. ఈ వ్యవహారం కాస్త పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది.
వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ రహ్మత్‌నగర్‌కు చెందిన యువతిని సైదాబాద్‌కు చెందిన యువకుడు ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సాప్ట్‌వేర్ కొలువు చేస్తుంటారు. అయితే అబ్బాయి వారింటిలో ఎవరూ నాన్ వెజ్ తినరు. ఇంట్లో నాన్ వేజ్ వడడం కూడా ఆ కుటుంబసభ్యులకు నచ్చదు. పెళ్లికి ముందు అమ్మాయికి మాఇంటిలో నాన్ వెజ్ వండరు. కావాలంటే నువ్వు బయట నుంచి తెచ్చుకొని తిను అని చెప్పాడు అబ్బాయి. అన్నింటికి అమ్మాయి ఒప్పుకుంది. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నాన్ వెజ్ విషయంలో వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తాజాగా ఆమె ఇంటిలో మటన్ వండాల్సిందేనని పట్టుపట్టింది. అంతేకాకుండా భర్తను కూడా మటన్ తినాలి ఫోర్స్ చేసింది. దానికి భర్త ఒప్పుకోక పోవడంతో.. నా మాట వినని భర్త నాకు వద్దూ అంటూ భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. అంతటితో ఆగకుండా భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మటన్ ముక్కకోసం భార్యభర్తల గొడవను చూసి షాక్ అయిన పోలీసులు నాన్ వెజ్ కోసం వారిద్దరు విడిపోవడం కరెక్ట్ కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.