- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమస్యాత్మకంగా.. మాన్యువల్ స్కావెంజింగ్
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఇంటిపని నుంచి వంట వరకు ప్రతీ దానికి మెషినరీపైనే ఆధారపడుతున్నాం. మనిషి చేతులకు మట్టి అంటుకోకుండా రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే సాంకేతికతను సొంతం చేసుకున్నాం. ఈ క్రమంలోనే మరుగుదొడ్లలోని మలమూత్రాలను మనుషులే ఎత్తిపోసే పద్ధతి నుంచి మనుషులకు విముక్తి కలిగించడంలో మెషనరీలు సాయపడ్డాయి. కానీ దేశంలో చాలాచోట్ల ఇప్పటికీ ఆ పద్ధతి కొనసాగుతుండటం ఆందోళన కలిగించే విషయం. దీనివల్ల అనారోగ్యాల బారినపడుతూ, ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే అత్యంత హీనమైన ఈ మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం 2013లో చట్టం తీసుకొచ్చినా.. దేశవ్యాప్తంగా ఇంకా యాభైవేలకు పైగా కార్మికులు ఇదే పనిలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ చట్టాన్ని పకడ్బందీగా ఎందుకు అమలు చేయలేకపోతుంది? సఫాయి కార్మికులకు పునరావాసం కల్పించడంలో ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?
మానవ విసర్జనను మాన్యువల్‌గా శుభ్రపరచడం, తీసుకెళ్లడం, పారవేయడం తదితర చర్యలనే భారత్‌లో ‘మాన్యువల్ స్కావెంజింగ్’గా సూచిస్తారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కాగా దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్‌కు ఎవరూ ఎఫెక్ట్ కాలేదని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 4న పార్లమెంటుకు తెలియజేసింది. అయితే గడిచిన మూడు దశాబ్దాల్లో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు చేస్తూ 941 మంది చనిపోయారని లెక్కలు చెబుతుండగా.. 2019 సర్వే ప్రకారం 58,098 మంది కార్మికులు ఇప్పటికీ ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు.
బహిరంగ రహస్యం..
ఎంప్లాయిమెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లెట్రిన్స్(ప్రొహిబిషన్) యాక్ట్ కింద 1993 నుంచి పారిశుధ్య కార్మికుల ద్వారా మాన్యువల్‌గా మానవ మలం సేకరించడం ఇండియాలో నిషేధించబడింది. కానీ మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా కొనసాగుతుందన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ వృత్తి అనేక మందికి జీవనాధారంగా ఉండగా.. అత్యంత పేదవర్గాల్లో మాన్యువల్ స్కావెంజర్స్ కూడా ఒకరు. సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి వ్యవస్థలను మాన్యువల్‌గా శుభ్రపరిచే పనిని చాలామంది హీనంగానే చూస్తారు. ఇటువంటి వివక్షే మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని పొందకుండా అడ్డుపడుతోంది. దీంతో చాలామంది తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఈ రోజుకి కూడా దేశవ్యాప్తంగా అనేక మరుగుదొడ్లు.. ఓపెన్ డ్రెయిన్స్, సెప్టిక్ ట్యాంకులకు కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అంటే వాటికి రెగ్యులర్ మాన్యువల్ క్లీనింగ్ అవసరం. ఇందుకు ఆల్టర్నేట్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు.. వివిధ మునిసిపల్ కార్పొరేషన్లకు సకింగ్ మెషిన్స్ ఏర్పాటు చేసినప్పటికీ, ప్రజలు మాన్యువల్ స్కావెంజర్లను నియమించడానికే మొగ్గుచూపుతున్నారు.
గుర్తింపు, పునరావాసం..
మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించి, వారికి పునరావాసం కల్పించేందుకు భారత ప్రభుత్వం 1933 ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ చట్టాన్ని ‘మాన్యువల్ స్కావెంజర్స్ పునరావాస చట్టం’గా రీప్లేస్ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ డేటాను విశ్లేషిస్తే.. అత్యధికంగా తమిళనాడులో 213 మరణాలు రిజిస్టర్ కాగా, గుజరాత్‌లో 153, ఉత్తరప్రదేశ్‌లో 104, ఢిల్లీలో 98, కర్ణాటకలో 84, హర్యానాలో 73 మరణాలు నమోదయ్యాయి. జనవరి 2007లో ఏర్పాటు చేసిన ‘స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ (SRMS)’ కింద గుర్తించబడిన, అర్హత కలిగిన మాన్యువల్ స్కావెంజర్ల ఖాతాల్లోకి వన్ టైమ్ క్యాష్ అసిస్టెన్స్‌గా రూ. 40వేల నగదు సాయం నేరుగా జమ చేయబడుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న మాన్యువల్ స్కావెంజర్లందరినీ ప్రభుత్వం గుర్తించకపోవడమే అసలు సమస్య. 2013, 2018లో చేపట్టిన రెండు వేర్వేరు సర్వేల ఆధారంగా భారత్‌లో 58,098 మంది మాన్యువల్ స్కావెంజర్స్‌ను గుర్తించినట్టు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో తెలిపారు. అయితే 2008లో 770,338గా ఉన్న మాన్యువల్ స్కావెంజర్ల సంఖ్య నుంచి 2018లో 42,303కి పడిపోవడం చూస్తుంటే ఇది వాస్తవ సంఖ్యను ప్రతిబింబించడం లేదనే విషయం అర్థమవుతోంది.
కుల వృత్తిగా..
3వేల సంవత్సరాల పురాతన కుల వ్యవస్థ ప్రకారం.. ‘బ్రాహ్మణులు, క్షత్రియుడు, వైశ్యులు, శూద్రులు’ అనే నాలుగు కుల వర్ణాలు వేలాది ఉప సమూహాలను కలిగి ఉన్నాయి. ఈ ఉప సమూహాలలో ప్రతి దానికి నిర్దిష్ట వృత్తిని విధించారు. ఈ వరుస క్రమంలో ముగింపు కులం అంటరానివారిది. ఈ కులానికి చెందిన వ్యక్తులు తరచుగా బహిష్కృతులుగా చూడబడ్డారు. దీనికి ప్రధాన కారణం వారు మురికి వ్యర్థాలను శుభ్రపరిచే వృత్తిలో కొనసాగడమే. సంస్కృతంలో దీన్ని ‘భంగి’ అని అంటారు. దీనికి హిందీ అనువాదం ట్రాష్. దురదృష్టవశాత్తు ఈ సర్వీస్ ఇప్పటికీ ప్రబలంగానే ఉన్నా.. పైకి మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
ఆరోగ్య సమస్యలు..
2005లో ఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం(200 మంది కార్మికులతో).. శానిటేషన్ కార్మికులు సగటు జనాభా కంటే తక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటారని తేలింది. వీరిలో కొందరు 60 ఏళ్లకు మించే జీవిస్తున్నా.. 50 ఏళ్లు పైబడిన వారిలో ఆ సంఖ్య తగ్గుతూ ఉందని చెప్పింది. అమ్మోనియా, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విష వాయువులకు మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు నిలయం ఉంటుండగా.. వీటితో డైరెక్ట్ కాంటాక్ట్‌కు గురైతే అపస్మారక స్థితికి చేరడమే కాకుండా మరణానికి దారితీయొచ్చు. అంతేకాదు మాన్యువల్ స్కావెంజర్స్.. కార్డియోవాస్కులర్ డీజనరేషన్, మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్, ఇన్ఫెక్షన్లు, లెప్టోస్పిరోసిస్, చర్మ సమస్యలతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటారు. కాగా ఈ వృత్తిలో కొనసాగుతున్నవారికి కొవిడ్ -19 వైరస్ వల్ల మరింత హాని జరిగే ప్రమాదముంది.
మానవ విసర్జనను మాన్యువల్‌గా ఎత్తిపోసే చర్యకు సమాజంలోనూ కళంకం ఉంది. వారి కుటుంబాలు భారతీయ సమాజంలో చాలా వేధింపుల్ని ఎదుర్కొంటున్నాయి. న్యాయపరమైన జోక్యంతో పాటు మాన్యువల్ స్కావెంజింగ్ ఎంత ప్రబలంగా ఉందో సరైనా అంచనా వేయడమే ముందున్న ఏకైక మార్గం. పౌరులు కూడా ఈ సమస్యపై ప్రత్యేక అవగాహన ఏర్పరచుకుని, ఇలాంటివి కనిపించినపుడు అధికారులకు రిపోర్ట్ చేయాలి. ఈ పనికి ప్రత్యామ్నాయంగా తగినన్నీ మెషినరీస్ ఉండాలి. ఈ వృత్తిలో ఉన్నవారందరికీ తప్పనిసరిగా పునరావాసం కల్పించడంతో పాటు దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలి. దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే సంబంధిత కుటుంబాలకు పరిహారం అందజేయాలి. మాన్యువల్ స్కావెంజింగ్‌ను గ్రౌండ్ లెవెల్ నుంచి సమూలంగా రూపుమాపే చర్యలను అధికారులు ప్రోత్సహించాలి.