- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్: రోడ్డుపై అడుగెట్టాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 144 అమల్లో ఉన్నందున నలుగురికి మించి గుమిగూడరాదు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్డుపై అడుగు పెట్టాలంటే ఎవరెవరికి ఏ డాక్యుమెంట్లు అవసరం? ఎవరెవరు బయటికి వెళ్ళవచ్చు? అనే విషయాన్ని పరిశీలిద్దాం..
* లాక్ డౌన్ మినహాయింపు ఉన్న సర్కార్ ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును కలిగి ఉండాలి.
ఏ పాసులు అవసరం లేని వారు:
* నిత్యావసర సరుకులు మెడిసిన్స్ కోసం సమీప దూరానికి వెళ్లేవారికి ఏ పాస్ లు అవసరం లేదు.
* ఎమర్జెన్సీగా వైద్య అవసరం కోసం వెళ్లేవారికీ మినహాయింపు ఉంది. అయితే ఇద్దరి కంటే ఎక్కువ కలిసి ఉండరాదు.
* వ్యవసాయ పనులు, మత్స్య, పశుపోషణ చేసుకునే వ్యక్తులకు ఏ గుర్తింపు కార్డు అవసరం లేదు.
యాజమాన్యం జారీచేసిన ఐడీలు కావలసినవారు:
* వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ వైద్య రంగానికి చెందిన ఇతర ఉద్యోగులు రోడ్డుపై అడుగు పెట్టేముందు యాజమాన్యం జారీచేసిన ఐడీలు వెంట తీసుకెళ్లాలి.
* విద్యుత్ నీటి సరఫరా లాంటి అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు సహా బ్యాంకు ఉద్యోగులు, పెట్రోలు, ఎల్ పిజి, సి ఎన్ జిలకు సంబంధించిన కార్మికులకు ఐడి కార్డు ఉంటే లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
* ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది.. న్యూస్ పేపర్ డెలివరీ కార్మికులందరూ యాజమాన్యం ఇచ్చిన ఐడి కార్డులతో తమ సేవలు నిర్వర్తించవచ్చు.
* రైల్వే, పోర్టు, ఎయిర్ పోర్టు సిబ్బంది సహా నిత్యావసర ఉత్పత్తుల పంపిణీ చేసే కార్గో, వాహనాల సిబ్బంది ఐడి కార్డులు వెంట బెట్టుకొని తమ సేవలను కొనసాగించవచ్చు.
పోలీసులు ఆమోదించిన.. యాజమాన్యం ఆథరైజేషన్ లెటర్ కావలసినవారు:
ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద పనిచేసే నిత్యావసర సరుకుల పంపిణీలో పాలుపంచుకునే ఉద్యోగులు, హైపర్ మార్ట్ లు, సూపర్ స్టోర్లు, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ సహా ఆహారాన్ని హోమ్ డెలివరీ చేసే కార్మికులు… పోలీసులు లు లేదా స్థానిక ఎస్ డి ఓ లు ఆమోదించిన యాజమాన్యం ఆథరైజేషన్ లెటర్ ను కలిగి ఉండాలి.
Tags : Coronavirus, lockdown, how to get out, id cards, exemption, 144 section