నాలుగు డివైజ్‌ల్లో ఒకే వాట్సాప్

by Harish |
నాలుగు డివైజ్‌ల్లో ఒకే వాట్సాప్
X

దిశ, వెబ్‌డెస్క్:

ఇప్పటి వరకు వాట్సాప్‌ను ఒకటే నెంబర్‌తో ఒకటే డివైజ్‌లో ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ త్వరలో ఒకే నెంబర్‌తో నాలుగు వేర్వేరు డివైజ్‌లలో ఉపయోగించే సదుపాయం రాబోతోంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఫైనల్ దశలో ఉందని, త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ వెర్షన్‌లకు కూడా అందుబాటులోకి రానుంది. అయితే ప్రైమరీ డివైజ్‌లో ఉన్న సెట్టింగ్‌లు, బ్యాకప్ చాట్‌లను లింక్ చేసిన డివైజ్‌లలో కూడా పొందుపరిచేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. దీంతో పాటు డెస్క్‌టాప్ వెర్షన్ కోసం కొత్త యూజర్ ఇంటర్ఫేస్‌ను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ మల్టీపుల్ డివైజ్ ఫీచర్ పనిచేయడానికి వైఫై తప్పనిసరి అవుతుందని, అప్పుడు ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యాకనే పూర్తిస్థాయిలో వాట్సాప్‌ను ఉపయోగించే వీలు కలుగుతుందని వాట్సాప్ డెవలప్‌మెంట్స్ మీద ఒక కన్నేసి ఉంచే డబ్ల్యూఏబీటాఇన్‌ఫో వెబ్‌సైట్ తెలిపింది. ఒకసారి డేటా ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యాక ఇక మళ్లీ మళ్లీ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదని, ప్రస్తుతం వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నట్లుగానే ఈ ఫీచర్ కూడా పనిచేస్తుందని వివరించింది. ఏదేమైనా ఉపయోగిస్తున్న అన్ని డివైజ్‌లలో ఒకే వాట్సాప్ నెంబర్ ఉపయోగించగలిగితే ఎంతో కొంత ఉపయోగమేనని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story