- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిద్రపోయే భంగిమతో మీ ప్రియురాలి గురించి తెలుసుకోండిలా?
దిశ,వెబ్‌డెస్క్: 100మందిలో 90శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అందుకు కారణం రాత్రి పడుకునే సమయంలో మొబైల్ యూజ్ చేయడం, లేట్ నైట్ దాకా ఫ్రెండ్స్ తో ముచ్చుట్లు పెట్టుకోవడంలాంటివి ఉండొచ్చు. అయితే ఈ సమస్యలతో పాటు బెడ్ పై పడుకునే భంగిమల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో బెడ్ పై ఎవరు ఏ భంగిమలో పడుకుంటారో వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. మరి మీ క్యారక్టర్, మీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లేదంటే మీ ప్రియురాలి క్యారెక్టర్ ఎలాంటిదో నిద్రపోయే భంగిమల ద్వారా తెలుసుకోవచ్చు.
పిండాకారంలో పడుకోవడం
తల్లి గర్భంలో పిండం కాళ్లు చేతులు ముడుచుకొని ఉంటుంది. పురుషులైన, మహిళలైన అలా ఒక పక్కకు తిరిగి పడుకోవడం కామన్. ఈ భంగిమలో పడుకున్న వారిలో మోసం చేసే గుణం ఉండదు. చాలా సెన్సిటీవ్‌గా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతుంటారు.
బోర్లా పడుకోవడం
బెడ్ పై ఉదరాన్ని ఆనిస్తూ పడుకున్న వారి శరీరంలో చికాకును కలిగించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అలా ఎవరైతే పడుకుంటారో వారిలో కండరాలు దృఢత్వాన్ని కోల్పోవడం, మెడనొప్పితో పాటు రకరకాలైన అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది. ఎవరికైనా ఈ భంగిమలో పడుకునే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవడం చాలా ఉత్తమం.
నిటారుగా ఓ పక్కకు పడుకోవడం
తల్లిగర్భంలోని పిండాకారం తరువాత ఎక్కువమంది ఇలా బెడ్ పై నిటారుగా ఓ పక్కకు తిరిగి పడుకుంటారు. ఇలా పడుకునే వారు అందరితో స్నేహంగా ఉంటారు. సామాజిక స్పృహ చాలా ఎక్కువ. అందరు నమ్మకస్తులేనని నమ్ముతారు. అదే నమ్మకంతో ఉంటారు. ఎవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు.
చేతుల్ని తలపైన పెట్టుకొని పడుకోవడం
వైద్య పరిభాషలో ఇలా పడుకోవడాన్ని ద సోల్జర్ అని పిలుస్తారు. ఇలా ఒకచేయి తలపైనే మరో చేయి ఉదరంపైన పెట్టుకొని పడుకునే వారు చాలా రిజర్వ్ గా ఉంటారు. తమని తామే చాలా ఇష్టపడుతుంటారు. చాలా తక్కువ మంది స్నేహితులుంటారు. స్నేహితులే అయినా వారిని మేనేజ్ చేయలేరు.
స్టార్‌గేజర్ భంగిమ
స్టార్‌గేజర్ ఫోజ్‌లో చాలా తక్కువ మంది పడుకుంటారు. పైన ఆకాశాన్ని చూస్తూ తల కింద చేతులు పెట్టుకొని ఫ్రీగా పడుకుంటారు. అలాంటి వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, బాధ్యతగా ఉంటారు. స్నేహాన్ని కోరుకుంటారు. ప్రేమిస్తారు. అలా ప్రేమించే వారి సంతోషం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు.
ఫ్రీఫాలర్ భంగిమ
పైన మనం చెప్పుకున్నట్లు గా బోర్లా పడుకొని ఉదరాన్ని బెడ్‌కు ఆనిచ్చడం కామన్. కానీ అదే భంగిమలో విశాలంగా రెండు చేతులతో బెడ్ మొత్తాన్ని ఆక్రమించే భంగిమలో పడుకునే వారు చాలా స్నేహంగా ఉంటారు. ధైర్యంగా ఉంటారు. కానీ ఎవరైనా విమర్శిస్తే అస్సలు ఒప్పుకోరు. చాలా డీలా పడి పడిపోతుంటారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు.
ఫ్రీ స్టైలర్ భంగిమ
ఫ్రీ స్టైలర్ భంగిమ అంటే? రోజుకో రకం భంగిమలొ పడుకునే పద్దతి మార్చుకోవడం . ఇలా రోజూ పడుకునే భంగిమను మార్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా ప్రతీ రోజు నిద్రపోయే భంగిమను మార్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతుంది.కాబట్టి ఈ తరహా లక్షణాలున్నవారు జీవన శైలిని మార్చుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.