- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాయామం చేసేటప్పుడు బీపీ ఉంటే…?
దిశ, వెబ్ డెస్క్: అధిక బీపీ గుండె జబ్బులకు దారితీస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే వ్యాయామం చేసినపుడు, ఆందోళనలో ఉన్నప్పుడు బీపీ లో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. కానీ వ్యాయామం చేసేటప్పుడు, ఆ తర్వాత బీపీ ఎక్కువగా ఉంటే మాత్రం దానిని తేలికగా తీసుకోకూడదని, జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు.
ఎందుకంటే మధ్య వయసులో ఈ సమస్య ఉత్పన్నమైతే అది భవిష్యత్తులో గుండె సమస్యలకు దారి తీసే అవకాశం ఉందట. దీని కోసం వీళ్ళు దీర్ఘకాలికంగా ఓ అధ్యయనం చేశారట. అందులో భాగంగా సుమారు రెండు వేల మందిని ఎంపిక చేసి వ్యాయామం చేసేటప్పుడు, వ్యాయామం చేసిన మూడు నిమిషాల తర్వాత బీపీ చెక్ చేశారు.
ఐదేళ్ల తర్వాత వాళ్లందరినీ మళ్లీ చెక్ చేయగా వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి బీపీ లేనివాళ్లతో పోలిస్తే… వ్యాయామ సమయంలో, వ్యాయామం తరువాత ఎక్కువగా బీపీ ఉండే వాళ్లలో గుండె కండరాలు, కెరోటిక్ రక్తనాళాలు మందంగా మారినట్లు గమనించారు. దీన్నిబట్టి ప్రారంభంలోనే సమస్యను గుర్తించి జాగ్రత్తపడితే రాబోయే గుండె ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.