- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆయన ఏం చెబితే నిమ్మగడ్డ అదే చేస్తారు: బొత్స
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెండు మూడు నెలల సమయం పడుతుందన్నారు. ఎస్ఈసీ రాసిన లేఖను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ఏం చెబితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శాసన సభ హక్కులపై ప్రశ్నించే నైతిక హక్కు ఈసీకి లేదని బొత్స అన్నారు. చిత్తూరు డెయిరీని మూసేసి హెరిటేజ్ ను ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు.
Next Story