- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాలకులతో బరువు తగ్గుదల..
దిశ, వెబ్ డెస్క్: వంటింట్లో ఉండే , కొన్ని రకాల వంటకాల్లో వేసే యాలకులు తింటే బరువు తగ్గడమేంటి? అని అనుకుంటున్నారా..అవునండీ..నిజమే మీరు చదివింది.. యాలకులు తింటే బరువు మాత్రమే కాదు..మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందట..అది ఎలాగో..యాలకులలోని విటమిన్స్ ఏంటో తెలుసుకుందాం..
సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. యాలకులు కొన్ని రకాల వంటకాల్లో ప్రత్యేకంగా వేస్తుంటారు. అయితే, రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఇలా రాత్రివేళల్లో యాలకులు తీసుకుంటే ఇక మెడిసిన్ అవసరం లేదని చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో బరువును తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోరకమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే బరువు సింపుల్‌గా తగ్గాలి అనుకునే వారు ఉన్నారో..వారు రోజూ ఒక యాలక్కాయ తిని ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగడం వల్ల వారి శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందట. దాంతో అధిక బరువు తగ్గుదల, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. తద్వారా అన్ని అవయవాలు శుద్ధి చేయబడతాయి. ఇలా శరీర బరువు తగ్గుముఖం పడుతుందట.