వారంలో నాలుగు రోజులే పని! : గూగుల్

by Anukaran |
వారంలో నాలుగు రోజులే పని!  : గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్ :

టెక్ దిగ్గజం గూగుల్(Google) సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులు మాత్రమే పనిదినాలుగా ప్రకటించింది. మిగతా మూడు రోజులు సెలవులు అన్నమాట. తాజా ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్లు ఖుషీగా ఉన్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు శని, ఆదివారాలు మాత్రమే వారాంతపు సెలవులుగా ఉండేవి. తాజా నిర్ణయంతో శుక్రవారం కూడా సెలవు తీసుకునే అవకాశం లభించడంతో ఉద్యోగుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. Google ఉద్యోగులు దాదాపు 6 నెలల నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోం’(Work from home) చేస్తున్నారు. అయితే.. ‘వర్క్ ఫ్రమ్ హోం’ వల్ల పని గంటలు పెరిగాయని, వ్యక్తిగత సమయాన్ని కూడా విధుల కోసం కేటాయించాల్సి వస్తోందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్త గూగుల్ దృష్టికి వెళ్లింది.

దీంతో.. ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తున్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించే ఉద్దేశంతో తమ సంస్థలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులకు శుక్రవారం రోజును కూడా వీక్ఆఫ్‌గా ప్రకటించింది. Google తాజా నిర్ణయంతో ఇతర ఐటీ సంస్థలు అనగా ‘వర్క్ ఫ్రం హోం’ చేసే ఉద్యోగులు కూడా తమకు రెండ్రోజుల వారంతాపు సెలవుతో పాటు అదనంగా మరోరోజు వీక్‌ఆఫ్ తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Next Story