ఆ రాష్ట్రంలో ఐదురోజులే పని.. రెండ్రోజులు లాక్‌డౌన్

by vinod kumar |   ( Updated:2020-07-12 04:46:39.0  )
ఆ రాష్ట్రంలో ఐదురోజులే పని.. రెండ్రోజులు లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు యూపీలోని యోగి సర్కారు కీలకనిర్ణయం తీసుకుంది. ప్రతి శని మరియు ఆదివారం అన్ని కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని నిర్ణయించింది. అయితే, బ్యాంకులు, ఇతర పారిశ్రామిక విభాగాలకు ఈ నిబంధన వర్తించదని పేర్కొంది. యూపీ హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అవనీశ్ అవస్థి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చునని కానీ, అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోకుండా రవాణా వాహనాలను కూడా అనుమతిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో ఆరోగ్య శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు పారిశుద్ధ్య, పరిశుభ్రత కార్యక్రమాలు, శానిటైజేషన్ నిర్వహిస్తాయని వివరించారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వారంలో 5 రోజులు మాత్రమే పని చేస్తాయని స్పష్టం చేశార. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించినట్లు చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం సోమవారం వరకు 55 గంటల లాక్‌డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు, కొన్ని ఇతర సేవలు మినహా మిగిలినవాటిని పూర్తిగా బంద్ చేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఈ ఆంక్షలను సడలిస్తారు.కాగా, యూపీలో ప్రస్తుతం 35,092 పాజిటివ్ కేసులున్నాయి. శనివారం కొత్తగా 1,403 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

Advertisement

Next Story