- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
500కిలోల గంజాయి పట్టివేత..

X
దిశ, విశాఖపట్నం : విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి వద్ద రూ.20 లక్షల విలువ చేసే గంజాయిని అటవీ అధికారులు సొమవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో లంబసింగి అటవీ చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి విశాఖకు చిలగడ దుంపల లోడుతో వెళ్తున్న లారీని తనిఖీ చేయగా.. దుంపలు, అరటి గెలల కింద గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
లారీలో సుమారు 500 కిలోల గంజాయి ఉన్నట్లు తేలింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా అతడు పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులకు అప్పగించనున్నట్లు అటవీ సెక్షన్ అధికారి అప్పారావు తెలిపారు.
Next Story