Weather Alert: వాతావరణంలో మార్పులు!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-03-04 06:31:26.0  )
Weather Alert: వాతావరణంలో మార్పులు!
X

దిశ, వెబ్ డెస్క్ : భూమధ్య రేఖా ప్రాంతంలో వాతావరణం(Weather) వేగంగా మారుతోంది. దీనిపై భారత వాతావరణ(IMD) శాఖ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని ఉత్తర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్‌లో సిమ్లా, మనాలి, కులు వంటి ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. జమ్మూకాశ్మీర్‌లో గుల్‌మార్గ్, సోనమార్గ్‌లో రవాణా సేవలకు అంతరాయం కలుగుతోంది.

ఆకస్మిక వాతావరన మార్పులకు భారత వాతావరణ శాఖ ప్రకారం లా నీనా ప్రభావం కారణమవుతోంది. దీని ప్రభావంతో ఏర్పడిన వాతావరణ మార్పులతో హిమాలయాల్లో సాధారణం కంటే ఎక్కువ మంచు కురుస్తుందని అంచనా. మార్చి చివరి వరకు తేలికపాటి మంచు కురుస్తూనే ఉంటుందని భావిస్తున్నారు. చాల చోట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది.

భూమధ్య రేఖకు పైన ఓ భారీ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. దాని ప్రభావం దక్షిణ భారతం, మాల్దీవుల వరకూ విస్తరించి ఉంది. దీనికి తోడు లక్షద్వీప్ దగ్గర ఒక ద్రోణి ఏర్పడింది. ఈ పరిస్థితుల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లోకి మేఘాల సుడి రాయలసీమ నుంచి మొదలై.. తెలంగాణలోకి ప్రవేశించి ఉత్తర తెలంగాణ నుంచి తిరిగి ఏపీలోని ఉత్తరాంధ్రలోకి వస్తోంది. దీని ప్రభావంతో ఒక దిశ అంటూ లేకుండా అన్నివైపులకూ గాలులు వీస్తుంటాయి.

ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఏపీలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలో ఎండత తీవ్రత అధికం కానంది. మేఘాలు వచ్చినప్పుడు మాత్రం కొంత ఉపశమనంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో తేమ 30 శాతం కంటే తక్కువగా ఉంది. మొత్తంగా భూమధ్య రేఖా ప్రాంతంలో వాతావరణం గందరగోళంగా మారింది.

Next Story

Most Viewed