Heat Wave :తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

by M.Rajitha |   ( Updated:2025-03-17 11:22:30.0  )
Heat Wave :తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి(Heat Wave). ఎండాకాలం మొదలవడంతోనే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు విలవిలలాడుతున్నారు. కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో గత నాలుగురోజుల నుంచి తీవ్ర ఎండలతోపాటు వడగాలులు వీస్తుండటంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా కరీంనగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మరో మూడు రోజులపాటు ఇలాగే ఎండలు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) అధికారులు సూచించారు.

ఇక ఏపీ(AP)లో కూడా పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినట్టు సమాచారం. 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 167 జిల్లాల్లో మోస్తరు వడగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర(Amaravati Meteorological Center) అధికారులు పేర్కొన్నారు. సోమవారం అత్యధికంగా కర్నూలులో 40.6 డిగ్రీలు, నందిగామలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురంలో 39.2, ఎన్టీఆర్‌ జిల్లాలో 38.21 డిగ్రీల నమోదయ్యాయి. ప్రజలు పగటిపూట అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.



Next Story

Most Viewed