కమ్యూనిస్టు వారసత్వాన్ని ప్రజలకు అందిస్తాం : చెరుపల్లి సీతారాములు

by Shyam |
కమ్యూనిస్టు వారసత్వాన్ని ప్రజలకు అందిస్తాం : చెరుపల్లి సీతారాములు
X

దిశ, ఇబ్రహీంపట్నం : నూతన సాగు చట్టాల రద్దు రైతాంగ పోరాటాల విజయమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చేరులపల్లి సీతారాములు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందన్ని ఆయన మండిపడ్డారు. కేంద్రీకృత పాలన సాగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపురితమైన ఆలోచన చేస్తోందని విమర్శించారు. 2022 జనవరి 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన నిధి వసూళ్ల కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం, వెలిమినేడు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతం చేసిందన్నారు.

ఉభయసభల్లో మందబలం చూసుకొని నల్ల చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం విధిస్తున్నదని మండిపడ్డారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో చట్టాలను రద్దు చేసే బిల్లును ఆమోదించాలన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నాయన్నారు. ఈ తరుణంలో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు బహుముఖ ఉద్యమాలకు మార్గదర్శిగా నిలువనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు వారసత్వాన్ని ప్రజలకు అందించే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సమేల్, మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు గణేష్, బుగ్గరాములు, జగన్, లింగస్వామి, వెంకటేష్, రమేష్, సురేష్, ప్రభుదాస్, బిక్షపతి, వెంకటేష్, విజయమ్మ, మస్కు అరుణ, స్వప్న, ఎల్లేశ్, యాదగిరి, జంగయ్య, నర్సింహ, మల్లేష్, శ్రీను, భాస్కర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed