- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాచీన వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉంది: ప్రధాన మంత్రి
న్యూఢిల్లీ: రైతులు తమ దృష్టిని రసాయన పరీక్ష ప్రయోగశాలల నుంచి సహజ వ్యవసాయం పద్ధతులకు మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. గత ఏడేళ్లలో కేంద్రం వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతులతో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్ల తర్వాత ప్రయాణంలో కొత్త అవసరాలకు, కొత్త సవాళ్లకు అనుగుణంగా వ్యవసాయాన్ని అనుసరించాలని కోరారు.
గత ఆరేడు ఏళ్లలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. భూసార పరీక్ష నుండి వందలకొద్దీ కొత్త విత్తనాల వరకు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరను నిర్ణయించడం వరకు పలు అంశాలపై దృష్టి పెట్టామని అన్నారు. హరిత విప్లవంలో రసాయనాలు, ఎరువుల ముఖ్యమైన పాత్రను గుర్తిస్తూ, వాటి ప్రత్యామ్నాయాలపై ఏకకాలంలో కృషి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పురుగుల మందులు, దిగుమతి చేసుకున్న ఎరువుల వల్ల పెట్టుబడులు పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆయన హెచ్చరించారు.
వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు మరింత దారుణంగా మారకముందే చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని ప్రధాని ఉద్ఘాటించారు. ‘మేము మన వ్యవసాయాన్ని రసాయన శాస్త్ర ప్రయోగశాల నుండి ప్రకృతి ప్రయోగశాలకు అనుసంధానించాలి. నేను ప్రకృతి ప్రయోగశాల గురించి మాట్లాడేటప్పుడు, అది పూర్తిగా శాస్త్రీయ ఆధారితమైనది’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈరోజు ప్రపంచం ఎంత ఆధునికంగా మారుతుందో, అంత ఎక్కువగా ప్రాచీనత వైపు పయనిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. గత మూడు రోజులుగా(14-16) ప్రకృతి వ్యవసాయంపై గుజరాత్ ప్రభుత్వం జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి 5 వేల మంది రైతులు హాజరయ్యారు.
- Tags
- focus