దేశంలో నకిలీ లౌకికవాదంతో యుద్ధం చేస్తున్నాం : మురళీ మనోహర్

by Shyam |   ( Updated:2021-12-13 09:14:27.0  )
BJP
X

దిశ, భువనగిరి రూరల్ : ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక జాతీయ జీవన విధానానికి, నకిలీ లౌకికవాదం మధ్య యుద్ధం జరుగుతుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మురళీ మనోహర్ అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వెన్నెల ఇంజనీరింగ్ కళాశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యామ్ సుందర్ రావు అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా శిక్షణా తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ నేడు హిందుత్వ విధానానికి అండగా నిలబడుతుందని, ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు.

దేశంలో అనేక సమస్యలను వెంటాడుతున్నా మొక్కవోని ధైర్యంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తూ ప్రజల మెప్పు పొందుతుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన సామర్థ్యంతో ప్రపంచ దేశాలతో మైత్రిని కొనసాగిస్తూ భారత వ్యతిరేక శక్తులకు గుణపాఠం చెబుతున్నారని, ప్రపంచమంతా కరోనా మహమ్మారికి భయపడి ఆందోళన చెందితే వారిందరికీ భారత్ అండగా నిలిచిందని కాతాబు ఇచ్చారు. దేశంలో125 కోట్ల మంది ప్రజలకు కరోన టీకాలు ఉచితంగా ఇచ్చి ప్రధాని ప్రజల దీవెనలను పొందారని అన్నారు. రైతులకు పెట్టుబడికి ఆర్థికసాయం, ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకువచ్చిన ఘటన బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని మురళీ మనోహర్ అన్నారు.

Murali Manohar

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్, జిల్లా ఇంచార్జ్ నంద కుమార్ యాదవ్, రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, కర్నాటి ధనుంజయ, దళిత మోర్చా జాతీయ నాయకులు వేముల అశోక్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, రాఘవుల నరేందర్, నగరికంటి మొగులయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చందా మహేందర్ గుప్త, దంతూరి సత్తయ్య, చంద్ర శేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ లావణ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ, శిక్షణ తరగతుల కన్వీనర్ బంధారపు లింగుస్వామి, కో కన్వీనర్లు పిట్టల అశోక్, చిరిగే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed