- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పహల్గామ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. అక్కడి పరిస్థితిని వివరిస్తూ వీడియో షేర్ చేయడంతో నెట్టింట ట్రోల్స్

దిశ, సినిమా: ఎంతో అందంగా ఉండే పర్యాటక ప్రదేశం జమ్మూ కశ్మీర్. నిత్యం అక్కడికి ఎంతోమంది వెళ్తూ నేచర్‌ను ఎంజాయ్ చేసి వస్తుంటారు. అయితే ఇప్పుడు పిల్లలకు సమ్మర్ సెలవులు కావడంతో చాలామంది వెళ్తున్నారు. అయితే అక్కడి పర్యాటకుల ఆనందాన్ని చెల్లాచెదురు చేసింది ఉగ్రవాదుల దాడి. పంజా విసరడంతో అమాయకపు జనాలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిలో దాదాపు 26 మంది మరణించగా.. మరికొందరు గాయాలపాలయ్యారు. దీంతో ఉగ్రదాడి గురించి తెలుసుకున్న పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండియాకు పరుగులు తీస్తున్నారు. ఇక ఈ దాడి నుంచి బుల్లితెర జంట తప్పించుకున్నారు. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ పహల్గాం దాడి గురించి పోస్టులు కనిపిస్తున్నాయి.
దీనిపై ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ స్పందించి సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా, బిగ్‌బాస్ బ్యూటీ అర్జే కాజల్(Arje Kajal) అక్కడే ఉన్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఓ పూల తోటలో ఉన్న ఆమె పంజాబీ డ్రెస్ ధరించి స్టైలీష్‌గా కనిపించింది. ‘‘ప్రస్తుతం నేను పహల్గామ్(Pahalgam) నుంచి శ్రీనగర్(Srinagar) వెళ్తున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం స్థానిక పోలీసులు అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. నా కోసం ఆరా తీసిని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
అలాగే ఈ పోస్ట్‌కు ‘‘ఈ వీడియో కాశ్మీర్‌లో మా ప్రయాణంలో నా ప్రియమైన వారికి భరోసా ఇవ్వడానికి ఉద్దేశించి షేర్ చేశాను. పహల్గామ్‌లో ఇటీవల జరిగిన విషాద సంఘటనల పట్ల నేను చాలా బాధపడ్డాను. బాధితులకు వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఇటువంటి హింసాత్మక చర్యలను నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. ఈ ప్రాంతంలో శాంతి స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు ఆమెను జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు పెట్టగా.. మరికొందరు మాత్రం అందమంది ప్రాణాలు కోల్పోతే ఇంత బాధ కూడా లేదు నీకు అని ట్రోల్ చేస్తున్నారు. అలాగే నువ్వు ముస్లీం కాబట్టి నీకేం జరగదని అంటున్నారు.