కోహ్లీకి వార్నర్ 'షేవ్ చాలెంజ్'

by Shyam |
కోహ్లీకి వార్నర్ షేవ్ చాలెంజ్
X

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మంగళవారం గుండుతో దర్శనమిచ్చాడు. కాగా, కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులకు మద్ధతుగా తాను ఇలా గుండు చేసుకున్నట్లు వార్నర్ తెలిపాడు. అంతటితో ఆగకుండా ట్విట్టర్‌లో మరో ఇద్దరికి ‘క్లీన్ షేవ్ ఛాలెంజ్’ విసిరాడు. వారెవరో కాదు. జట్టులో తన సహచరుడు స్టీవ్ స్మిత్‌తో పాటు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. వారు కూడా ఇలాగే చేసి వైద్య సిబ్బందికి అండగా నిలవాలని పిలుపునిచ్చాడు. అదే సమయంలో తాను గుండు చేసుకుంటున్న వీడియోను కూడా ట్విట్టర్‌లో పెట్టాడు. ‘కరోనాపై పోరాడుతున్న వారిలో ముందు వరుసలో ఉన్న వైద్య సిబ్బందికి మద్దతుగా ఇలా షేవ్ చేసుకున్నా.. మీకు నచ్చిందా లేదా’ అని క్యాప్షన్ కూడా జత చేశాడు.

Tags: David Warner, Kohli, Smith, sahafed off head, Corona Doctors

Advertisement

Next Story