- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సచిన్ పై కాదు.. మా దర్యాప్తు వాళ్ల పైనే’
ముంబయి: రైతుల ఆందోళనలకు మద్దతుగా, వ్యతిరేకంగా చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అలీగఢ్ యూనివర్సిటీ మాజీ విద్యార్థి షర్జీల్ ఉస్మాన్‌పై చర్యలు తీసుకోవడానికి జంకుతున్న ప్రభుత్వం.. భారత రత్న అవార్డు గ్రహీతలు సచిన్ టెండూల్కర్, లతా మంగేశ్కర్‌లపై దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతున్నదని ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు కురిపించారు. ‘నేనే వారిని అలా ట్వీట్ చేయమని అడిగాననుకోండి, అందులో నా అపరాధమేముంది. ఒకవేళ మా పార్టీ అడిగినా అందుకు గర్విస్తాం. మీ దర్యాప్తునకు మేం బెదరం’ అని అన్నారు.
ఇందుకు సమాధానంగా తాము భారత రత్న అవార్డు గ్రహీతలు సచిన్ టెండూల్కర్, లతా మంగేశ్కర్‌లపై దర్యాప్తు చేయడంలేదని, కానీ, బీజేపీ ఐటీ సెల్‌పై మాత్రం దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ అన్నారు. సచిన్‌ను రాజ్యసభకు పంపిందని తామేనని, అతన్ని తామెప్పుడూ రాజకీయాలకు వాడుకోలేదని కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే తెలిపారు. స్వలాభం కోసం సెలబ్రిటీలను బీజేపీ వినియోగించుకుంటున్నదని దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారని అన్నారు. రైతుల ఆందోళనలపై రిహానా ట్వీట్ చేయడంతో కేంద్రానికి మద్దతుగా సచిన్ టెండూల్కర్, లతా మంగేశ్కర్‌లు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.