విరాట్‌ను చూసి నేర్చుకోండి : వీవీఎస్

by Shiva |
విరాట్‌ను చూసి నేర్చుకోండి : వీవీఎస్
X

దిశ, స్పోర్ట్స్: ప్రత్యర్థి జట్టుపై పై చేయి ఎలా సాధించాలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని.. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన ఎటాకింగ్ షాట్లతో పరుగులు రాబట్టాడని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. కోహ్లీని చూసి యువక్రికెటర్లు నేర్చుకోవల్సింది ఈ ఎటాకింగ్ వ్యూహమే అని లక్ష్మణ్ అన్నాడు. ‘ఒకానొక సమయంలో భారత జట్టు కనీసం 140 పరుగులైనా చేస్తుందా.. అని అందరూ అనుమానించారు. కానీ కోహ్లీ విజృంభనతో భారత జట్టు 150 స్కోర్ దాటింది. సరైన భాగస్వామ్యాలు నెలకొల్పి దూకుడుగా ఆడటంతో ఆ స్కోర్ సాధించింది. ఫీల్డింగ్‌లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసి మరీ అతడు షాట్లు ఆడాడు’ అని లక్ష్మణ్ అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు.

Advertisement

Next Story