- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాఫ్ట్‌గా ఉందని తక్కువ అంచనా వేయకండి...ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫైర్!

దిశ, వెబ్ డెస్క్: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న అమ్మాయి, సాఫ్ట్ గా ఉంది అనుకొని నన్ను తక్కువంచనా వేయవద్దని హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నానని, సమయం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతానని అన్నారు. తాము ఏం అనట్లేదని మాటిమాటికి అత్తాకోడళ్లు అనుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారా ? అంటూ మండిపడ్డారు. మిమ్మల్ని శివార్ల దాకా ఉరికించే బాధ్యత మాదే అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పాలకుర్తిలో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపించామని వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరి దమ్ము ఏంటో చూసుకుందామని సవాల్ విసిరారు.
తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తనకు విజన్ ఉందని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అనుకున్న సమయంలో పనులు జరుగుతాయని చెప్పారు. మరోసారి అత్తాకోడళ్లు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. మాజీ మంత్రి దయాకర్ రావు వయసుతో పాటూ హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. ఏడాది పాలనకే ఇంత ఫ్రస్టేషన్ వస్తే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం అయితారో, ఆరోగ్యాలు చూసుకోవాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఎర్రబెల్లి దయాకర్ నిన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ యశస్విని రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురింపించిన సంగతి తెలిసిందే.