- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటర్ జాబితా సవరణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
by Shyam |
X
దిశ, మహబూబ్‌నగర్: ‘ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్’ను ఎన్నికల అధికారులు, ఓటర్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడినట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లు, ప్రజలు.. తప్పనిసరిగా ‘ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్’ను డౌన్‌లోడ్ చేసుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదేశించినట్టు చెప్పారు. ఇక అధికారులు కూడా సాధ్యమైనంత వరకు ఈ యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ వెంకటరావు సూచించారు.
Advertisement
Next Story