- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెల్ల వివక్ష.. నల్ల లోగో
దిశ, స్పోర్ట్స్ :
అమెరికాలో జాతి వివక్షకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని నిరసిస్తూ అనేక మంది సెలెబ్రిటీలు, క్రికెటర్లు కూడా తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటికే విండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్, డారెన్ సామీలు జాతి వివక్షకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పారు. తాజాగా విండీస్ క్రికెట్ బోర్డు ఎరుపు రంగులో ఉండే లోగోను నలుపు రంగులోకి మార్చి తమ నిరసన తెలిపింది. విండీస్ బోర్డు, క్రికెట్ జట్టులో జాతి వివక్షకు తావుండదని బోర్డు తెలిపింది. మరోవైపు ఇంగ్లాండ్ బోర్డు ఒక పిక్ పోస్ట్ చేసింది. జోఫ్రా ఆర్చర్‌ను జాస్ బట్లర్ కౌగిలించుకున్న పిక్ పోస్టు చేసి.. ”భిన్నత్వానికి మద్దతిస్తాం.. జాతి వివక్షకు వ్యతిరేకంగా నిలుస్తాం” అని కొటేషన్ జత చేసింది. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర కూడా జాతి వివక్షకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పాడు. తాను కూడా ఇలాంటి వివక్షను ఎదుర్కున్నానని చెప్పాడు. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ కూడా ట్విట్టర్‌లో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోస్టు పెట్టాడు. ఇది నిజంగా బాధకరమైన విషయమని.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పాడు.