పహల్గామ్‌లో టూరిస్టుల సందడి.. దాడి తరవాతా తగ్గని క్రేజ్

by Ajay kumar |
పహల్గామ్‌లో టూరిస్టుల సందడి.. దాడి తరవాతా తగ్గని క్రేజ్
X

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్‌లోని అందమైన ప్రదేశం పహల్గామ్‌లో టూరిస్టులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఈ మారణహోమం తరవాత కశ్మీర్‌లో మళ్లీ టూరిస్టులు అడుగుపెడతారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కశ్మీర్‌లో చాలా సార్లు ఉగ్రదాడులు జరిగాయి కానీ టూరిస్టుల మీద దాడి జరగటం ఇదే మొదటిసారి. దీంతో కశ్మీర్ అంటేనే చాలా మంది భయపడుతున్నారు. కానీ కశ్మీర్ మాత్రమే కాదు ఏకంగా దాడి జరిగిన పహల్గామ్‌లో సైతం టూరిస్టులు సందడి చేస్తున్నారు.

తాజాగా ఓ టూరిస్టు మీడియాతో మాట్లాడారు. గుజరాత్ నుండి వచ్చిన అనాస్ అనే టూరిస్టు మాట్లాడుతూ...కశ్మీర్ అంటే చాలా ఇష్టమని అన్నారు. తమ తోటి టూరిస్టులపై దాడి జరగటం బాధకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా టూరిస్టుల ద్వారా ఎక్కువ వ్యాపారం పహల్గామ్‌లోనే జరుగుతుందని చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని స్థానికులు, ఆర్మీ వాళ్లు ధైర్యం చెప్పారని అన్నారు. టూరిస్టులను కాపాడేందుకు ఆర్మీ, ప్రభుత్వం, స్థానికులు ఉన్నారని చెప్పారు. దాడి తరవాత భయడ్డామని తిరిగి వెళ్లిపోవాలి అనుకున్నామని కానీ ఆర్మీ అధికారులు, స్థానికులు తమకు ధైర్యం చెప్పడంతో ట్రిప్ కొనసాగిస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed