చూపు లేకున్నా… సివిల్స్ ర్యాంక్ కొట్టింది 

by Anukaran |
చూపు లేకున్నా… సివిల్స్ ర్యాంక్ కొట్టింది 
X

దిశ, వెబ్ డెస్క్: దృష్టి లోపం తనను ఓడించలేదు. కంటి చూపు లోపం తనకి ప్రపంచాన్ని చూసే అవకాశం ఇవ్వకపోయినా…. ఆమె ప్రపంచాన్నే తనవైపు చూసేలా చేసింది. 25 ఏళ్ల దృష్టి లోపం ఉన్న అమ్మాయి యుపిఎస్‌సి పరీక్షలలో ఘన విజయం సాధించింది. తమిళనాడు మదురైకి చెందిన పూర్ణ సుందరికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో ఆల్ ఇండియా‌ 286వ ర్యాంకు వచ్చింది.

“నా తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వారి సహకారంతోనే నేను ఈ ర్యాంకు సాధించగలిగాను. ఇది నా 4 వ ప్రయత్నం, నేను ఈ పరీక్షకు 5 సంవత్సరాలు కేటాయించాను” అంటోంది పూర్ణ సుందరి. మా అమ్మాయిని చూస్తే గర్వంగా ఉందంటున్నారు ఆమె తల్లిదండ్రులు.

కాగా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తన ట్విట్టర్ ఖాతాలో పూర్ణ సుందరిని అభినందిస్తూ… “మీ కలలను వెంటాడడాన్ని ఎప్పుడూ ఆపవద్దు” అని ట్వీట్ చేశారు. నెటిజెన్లు ఆమెను అభినందిస్తూ మొహమ్మద్ ట్వీట్ కి కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story