- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కింగ్ ‘కోహ్లీ’ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
దిశ, వెబ్‌డెస్క్ : నిన్న పంజాబ్ వర్సెస్ బెంగళూర్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటి టీ20 ఆడిన పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన స్పిన్నింగ్ మాయాజాలంతో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(35), గ్లెన్ మాక్స్‌వెల్(0), ఏబీ డివిలియర్స్(3)ను పెవిలియన్‌కు పంపి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో పాటు ఐపీఎల్‌లో తొలి వికెట్‌గా కోహ్లిని అవుట్ చేశాడు.
https://twitter.com/IPL/status/1388198800901083138?s=20
ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం హర్‌ప్రీత్ బ్రార్‌ను విరాట్ కోహ్లి ప్రత్యేకంగా అభినందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ.. నవ్వుతూ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. భుజం తట్టి ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విటర్‌లో షేర్ చేసింది. ‘‘తొలి వికెట్.. పైగా అతడి నుంచి ప్రశంసలు.. బ్రార్‌కు ఇది కచ్చితంగా గుర్తుండిపోయే స్వీట్ మెమోరీ అవుతుంది’’ అని కామెంట్ చేసింది.