డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ కేక్ కటింగ్.. ధోని ఏం చేశాడో తెలుసా..(వీడియో)

by Anukaran |
డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ కేక్ కటింగ్.. ధోని ఏం చేశాడో తెలుసా..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లీ బర్త్ డే వేడుకలు ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగాయి. ఈ వేడుకలను ధోని అంతా తానే అయి జరిపించాడు. కేక్ రెడీ చేయడం దగ్గర నుంచి కేండిల్స్ కూడా ధోనినే వెలిగించాడు. అనంతరం కోహ్లీ పక్కనే ఉండి కేక్ కూడా కట్ చేపించాడు మిస్టర్ కూల్. ఇక కేక్ కటింగ్ అయ్యాక కోహ్లీ మొదటగా ధోనికే కేక్ తినిపించబోయాడు.

ఆ తర్వాత కోహ్లీ టీం ఇండియా ప్లేయర్స్‌ అందరికీ కేక్ తినిపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కేక్ కటింగ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తు్న్నారు.

Advertisement

Next Story