కోహ్లీ కంటే రోహిత్ అత్యుత్తమ కెప్టెన్

by Shyam |
కోహ్లీ కంటే రోహిత్ అత్యుత్తమ కెప్టెన్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్‌ను నిలిపి 4వ సారి టైటిల్ గెల్చిన రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ముంబై జట్టును విజేతగా నిలబెట్టినా అతడిని ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర దుమారమే చెలరేగింది. దీంతో అతడిని టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. కాగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ కంటే రోహిత్ శర్మనే అత్యుత్తమ కెప్టెన్ అని మాజీ క్రికెటర్ గంభీర్ అంటున్నాడు.

క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో ఆకాశ్ చోప్రాతో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ మంచి కెప్టెనే కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ అత్యుత్తమం. రోహిత్, కోహ్లీ మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది’ అని గంభీర్ అన్నాడు. గంభీర్ వ్యాఖ్యలకు ఆకాశ్ చోప్రా స్పందిస్తూ ‘ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ టోర్నీ ఆధారంగా టీమ్ ఇండియాలో మార్పులు చేయడం అనవసరం. కోహ్లీకి కూడా టీ20లో మంచి రికార్డు ఉన్నది’ అని అన్నాడు.

Advertisement

Next Story